Delhi Liquor Scam Case: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో సారి సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ మూడో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. తాజా చార్జిషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అమె భర్త అనిల్ పైన ఈడీ కీలక ఆభియోగాలు మోపింది. కవిత పేరును పలు మార్లు ప్రస్తావించిన ఈడీ .. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూపుది కీలక పాత్ర అని తెలిపింది. లిక్కర్ వ్యవహారంలో అరుణ్ పిళ్లై .. కవితకు ప్రతినిధిగా వ్యవహరించినట్లు పేర్కొంది.

లిక్కర్ వ్యాపారంలో వచ్చిన ఆదాయం ద్వారా హైదరాబాద్ లో భూములు కొన్నట్లు ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ ద్వారా భూములు కొనుగోలు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. తాజా చార్జిషీటులో ఫీనిక్స్ శ్రీహరి, కవిత భర్త అనిల్ పేర్లను ప్రస్తావించింది. ఫీనిక్స్ శ్రీహరి పాత్రపై ఈడీ అందులో పేర్కొంది. శ్రీహరి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలిపింది. శ్రీహరి నుండి కవిత 25వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేసినట్లుగా ఉందని పేర్కొంది. మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తం చెల్లించి కవిత కొనుగోలు చేసినట్లుగా తెలిపింది. ఇక ఎన్ గ్రోత్ క్యాపిటల్ లో అనిల్ భాగస్వామిగా ఉన్నట్లు తెలిపిన ఈడీ.. మాగుంట శ్రీనివాసులు, రాఘవపై అభియోగాలు చేసింది. ఈ కుంభకోణంలో సూత్రదారులు, పాత్రదారులకు సంబంధించి కీలక అధారాలు ఉన్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ మే 10వ తేదీన జరగనున్నది.
YS Jagan: సాత్విక్ – చిరాగ్ లకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్