ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ ఆర్ఎ స్ ఎమ్మెల్సీ కె కవిత ఢిల్లీ బయలుదేరారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 20వ తేదీ (రేపు) విచారణ రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆమె ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఆమెతో పాటు భర్త అనిల్, మంత్రి కేటిఆర్, సంతోష్, రాజీవ్ సాగర్ వెళ్లారు. ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై 24వ తేదీన విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలో రేపటి ఈడీ విచారణకు కవిత హజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరో పక్క కవిత పిటిషన్ పై ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనలు కూడా వినాలంటూ సుప్రీం కోర్టులో ఈడీ కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఒక పర్యాయం ఈ నెల 11వ తేదీన కవితను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఈ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో కవితను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత 16వ తేదీన మరో సారి విచారణకు హజరు కావాలని ఈడీ చెప్పింది. అయితే రెండో సారి విచారణకు కవిత హజరు కాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన హజరు కావాలని మరో సారి నోటీసులు జారీ చేసింది ఈడీ.
పొత్తుల కోసం ఎందుకీ వెంపర్లాట అంటూ ప్రతిపక్షాలపై సీఎం జగన్ విసుర్లు