NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి .. కాంగ్రెస్ పై మంత్రి కేటిఆర్ సెటైర్ లు

Share

Telangana Election 2023: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి ఇవేళ తన అనుచర వర్గంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సమక్షంలో ఆమె పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కేటిఆర్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై సెటైర్ లు వేశారు కేటిఆర్. కాంగ్రెస్ పార్టీలో 11 – 12 మంది నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకుని ఉన్నారని చెప్పారు. అసెంబ్లీకి పోటీ చేయడం లేదు కానీ తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ఇటీవల జానారెడ్డి చెప్పుకున్నారనీ, ఆ తర్వాత మధు యాష్కీ కూడా తాను కూడా అన్నట్లుగా మాట్లాడారన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బట్టి ఇలా చాలా మంది ఉన్నారన్నారు.

కాంగ్రెస్ కు ఓటు వేస్తే అయిదు గ్యారెంటీల సంగతేమో గానీ ఆరు నెలలకు ఒకరు ముఖ్యమంత్రులు మారతారని, సీల్డ్ కవర్లు వస్తుంటాయని సెటైర్ వేశారు కేటిఆర్. స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్ షిప్ ఉన్న రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్నారు. ఎప్పటికప్పుడు కూలిపోయే ప్రభుత్వాలు, ఎప్పటికప్పుడు మారిపోయే ముఖ్యమంత్రులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ పదిహేను రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో చాలా తప్పుడు ప్రచారాలను చేస్తారని హెచ్చరించారు. డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ మునుగోడులో గెలవాలని రాజగోపాల్ రెడ్డ చూస్తున్నారని కేటిఆర్ అన్నారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని ఓడించి బుద్ది చెప్పాలన్నారు.

రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీలు మారాడనేది అర్ధం కావడం లేదు, అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో ఎందుకు చేరాడు అని ప్రశ్నించారు. దివంగత సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన స్రవంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. పాల్వాయి స్రవంతి అభ్యర్ధిగా లేకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ ఓట్లు కూడా కాంగ్రెస్ కు వచ్చేవి కావన్నారు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకున్నారనీ, ఇప్పుడు ఒకరి భుజంపై ఒకరు చేతులేసుకుని తిరుగుతున్నారన్నారు. మునుగోడులో తమతో కలిసివచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ తాను చాలా ఆలోచించి బీఆర్ఎస్ లో చేరానన్నారు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తన తండ్రి చెప్పిన మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను పదవుల కోసం ఈ పార్టీలో చేరలేదన్నారు. బీఆర్ఎస్ తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. తనను నమ్మి వచ్చిన కార్యకర్తలకు భవిష్యత్తు ఇవ్వాలని కేటిఆర్ కు విజ్ఞప్తి చేశారు స్రవంతి.

Telangana Elections:  అచ్చంపేట లో అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణతో ఉద్రిక్తత .. బీఆర్ఎస్ అభ్యర్ధికి గాయాలు..అసలేమి జరిగింది..?


Share

Related posts

ఎంతిచ్చామో లెక్కలతో సహా చెప్పగలం : గడ్కరి

somaraju sharma

ప్రగ్నెంట్ గా ఉన్నవారు తప్పకుండా పాటించవలిసిన జాగ్రత్తలు!!

Kumar

నేడు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ … ఈ కీలక అంశాలపైనే చర్చ..?

somaraju sharma