NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS Candidate Kaushik Reddy: బీఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి పై ఈసీ సీరియస్, పోలీస్ కేసు నమోదు.. మరో ఎమ్మోషనల్ వీడియో వైరల్

BRS Candidate Kaushik Reddy: హూజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి పై ఈసీ సీరియస్ అయ్యింది. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఓటర్లను ఒక విధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. గెలిపిస్తే డిసెంబర్ నాల్గవ తేదీన జైత్ర యాత్రకు వస్తా..లేదంటే నా శవయాత్రకు రండి అంటూ కౌశిక్ రెడ్డి ఎమ్మోషనల్ కామెంట్స్ చేశారు. దీనిపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆ కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఆర్ ఓ కు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క కౌశిక్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 171 సీ, ఎఫ్, 188, 506, 123 ఆర్పీ యాక్ట్ కింద బీఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లుగా హూజూరాబాద్ ఇన్స్ పెక్టర్ సంజీవ్ తెలిపారు. ఎవరు కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని అన్నారు. ప్రతి ఒక్కరూ నిర్బయంగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్స్ పెక్టర్ సంజయ్ కోరారు.

ఇదిలా ఉంటే మరో సెల్ఫీ వీడియో కూడా కౌశిక్ రెడ్డి విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2018 లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులు గురైనప్పటికీ ఏనాడూ మిమ్మల్ని విడిచిపెట్టిపోలేదు. మీకష్ట శుఖాల్లో పాలుపంచుకున్నా. దయచేసి ఈ ఒక్క సారి మీరందరూ కారు గుర్తుకు ఓటు వేసి నను గెలిపించాలని చేతులు జోడించి కోరుతున్నాను. ఈ గుండె అలిసిపోయింది. ఈ గుండె బరువెక్కింది. ఈ గుండెను మీరే కాపాడుకోండని చేతులు జోడించి కోరుతున్నాను అంటూ ఎమ్మోషనల్ గా అభ్యర్ధించారు కౌశిక్ రెడ్డి.

అదే విధంగా ఆయన సతీమణి కూడా కొంగు చాచి అభ్యర్ధిస్తున్నా ఓటు బిక్ష వేసి తన భర్త కౌశిక్ రెడ్డిని గెలిపించాలని అంటూ అభ్యర్ధించారు. మీ అందరికీ దండం పెడిగి అడుగుతున్నా.. మా డాడీని గెలిపియ్యండి.. మా డాడీకి ఒక్క చాన్స్ ఇవ్వండి.. మా డాడీని కాపాడుకోండి అంటూ కౌశిక్ రెడ్డి కుమార్తె వేడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

JD Lakshmi Narayana: రాజకీయ ప్రస్థానంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ .. మళ్లీ పాత పాటే(గా)..!

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri