NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్

క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్ చేశారు. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ కు నాల్గవ రోజు ఈడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద చీకోటి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు. కొందరు తనపై పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ చీకోటి ప్రవీణ్ వారికి హెచ్చరించారు. సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ ఖాతాలు తెరిచి తప్పుడు పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం చేసే వారిని ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఇప్పటికే దీనిపై సీసీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

 

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మే వాళ్లు నమ్ముతారు. నమ్మని వాళ్లు నమ్మరని అన్నారు. ఈడీ విచారణ పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. తాను క్యాసినో నిర్వహించాననీ, దానిలో తప్పేముందని ప్రశ్నించారు. గోవా, నేపాల్ లో చట్టబద్దంగా నడుస్తున్న ప్రదేశాల్లోనే ఇక్కడ నుండి పలువురుని తీసుకువెళ్లినట్లు తెలిపారు. తనకు ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయన్నారు. తాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాననీ, భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని చెప్పారు చీకోటి ప్రవీణ్. తనకు ప్రాణహాని ఉందని అందుకే రక్షణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చీకోటి తెలిపారు.

చీకోటి ప్రవీణ్ చట్టబద్ద ప్రదేశాల్లో క్యాసినో నిర్వహణ చేసినప్పటికీ హవాలా మార్గంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయన్న అభియోగంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తొంది. ఇటీవల చీకోటి ప్రవీణ్ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభించడంతో వాటి ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తొంది. ప్రవీణ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ద్వారా అతనితో వ్యాపార లావాదేవీలు ఎవరెవరు నిర్వహించారు తదితర విషయాలపై ఆారా తీస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju