Delhi Liquor Scam: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ నుండి సమాధానం వచ్చింది. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నివాసంలో సమావేశం అవుదామని లేఖలో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితను సీబీఐ విచారించే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తొలుత ఈ నెల 6వ తేదీన విచారణ చేయడానికి ఎక్కడ కలవాలో చెప్పాలని కవితకు సీబీఐ తొలుత లేఖ రాసింది.

అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఆరవ తేదీ విచారణకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదనీ, ఈ నెల 11,12,14,15 తేదీల్లో వస్తే తాను అందుబాటులో ఉంటానని కవిత సీబీఐకి మెయిల్ ద్వారా లేఖ రాశారు. అయితే నిన్ననే ఢిల్లీ నుండి నలుగురు సీబీఐ అధికారులు హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా సమాచారం రావడంతో ఈ రోజు కవిత ఇంటికి విచారణకు వస్తారని అందరూ భావించారు.

ఈ రోజు ఉదయం కవిత జగిత్యాల పర్యటన వెళ్లాల్సి ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ హైదరాబాదులోని తన ఇంటి వద్ద వేచి ఉన్నారు. ఈ క్రమంలో కవిత రాసిన లేఖపై సీబీఐ స్పందించింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు తాము వచ్చి స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంటామని సీబీఐ తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మెయిల్ ద్వారా కవితకు ఈ విషయాన్ని తెలియజేశారు.
విజయసాయి రెడ్డికి మరో సారి ఆ అరుదైన అవకాశం
