తెలంగాణ‌ న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

Share

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంలో సీబీఐ బృందం నాలుగు గంటల పాటు తనిఖీ చేసింది. హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లే బెంగళూరు కేంద్రంగా లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో ఈ రోజు ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

సీబీఐ నమోదు చేసిన కేసులో మనీశ్ సిసోడియా ఏ 1 గా ఉండగా, రెండవ నిందితుడుగా డిల్లీ పోలీస్ కమిషనర్ గా పని చేసిన గోపీ కృష్ణ ఉన్నారు. 14వ నిందితుడుగా రామచంద్ర పిళ్లై నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి దేశ వ్యాప్తంగా మొత్తం 31 ప్రదేశాల్లో సోదాలు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. ఢిల్లీ, గుర్ గామ్, ముంబాయి, హైదరాబాద్, లక్నో, బెంగళూరు ప్రాంతాల్లో సోదాలు జరిపిన సీబీఐ .. పలు కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు వెల్లడించారు.


Share

Related posts

Road accident : కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

bharani jella

Empty Stomach: ఖాళీ కడుపుతో ఈ పనులు చేస్తున్నారా..!! అయితే ప్రమాదమే..!!

bharani jella

Gruhapravesam: గృహప్రవేశం కోసం పెట్టిన  ముహూర్తానికి  ఇంట్లో అడుగుపెట్టాలా ?లేదా ఆ ముహూర్తానికి  పాలు పొంగించాలా?

siddhu