Kishan Reddy: హైదరాబాద్ కు చెందిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గుండె సంబంధిత ఇబ్బంది రావడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తొంది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల వరకూ కిషన్ రెడ్డి హైదరాబాద్, సికింద్రాబాద్ లలో విస్తృతంగా పర్యటించారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ గౌర్ రైలును ఆయన సికింద్రాబాద్ లో జెండా ఊపి ప్రారంభించారు.

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తీరికలేకుండా గడిపిన కిషన్ రెడ్డి అనంతరం ఢిల్లీకి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత స్వల్పంగా గుండెనొప్పికి గురైయ్యారు. గుండె సంబంధింత ఇబ్బందులు తలెత్తడంతో నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో హుటాహుటిన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ క్రిటికల్ కార్డియాక్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కిషన్ రెడడి వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెబుతున్నారు. ఇవేళ సాయంత్రానికి ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తీరిక లేకుండా కార్యక్రమాల్లో పాల్గొనడం, విశ్రాంతి లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ట్ ట్రబుల్ తో గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తినట్లుగా చెబుతున్నారు.
KCR: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసిఆర్ సర్కార్ .. 40 విభాగాల్లోని 5544 మంది కుటుంబాలకు మేలు