NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ సినిమా

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు ఇకలేరు

Share

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు ఇక లేరు. ఆయన కొద్ది సేపటి క్రితం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు నెలలుగా ఆయన అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  రెండు నెలలుగా మృత్యువుతో పోరాడిన శరత్ బాబు చివరకు ఇవేళ మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు.

Cine actor Sarath Babu Passed away

1974లో రామరాజ్యం సినిమాతో హీరోగా పరిచయమైన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన సినిమాలు అనేకం విజయవంతమయ్యాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరి సారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబు దాదాపు 300 కిపైగా చిత్రాల్లో ఆయన నటించారు. శరత్ బాబు మృతి ఆయన కుటుంబాన్ని విషాదాన్ని నింపింది.

శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరు గురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. సత్యన్నారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబ సభ్యులు సత్యం బాబుగా పిలిచేవారు. దాదాపు అయిదు దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. శరత్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సీబీఐ కి బిగ్ షాక్ .. మరో లేఖ రాసిన అవినాష్ రెడ్డి


Share

Related posts

Sonu Sood: నేడు ఏపికి సోనూ సూద్ రాక..! ఎందుకంటే..?

somaraju sharma

ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసిన మంగళ్ హాట్ పోలీసులు.. ఎందుకంటే..?

somaraju sharma

Machilipatnam: టీడీపీ నేతలపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు

somaraju sharma