NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

CJI Justice NV Ramana: తెలంగాణ సీఎం కేసిఆర్ ను ప్రశంసించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

CJI Justice NV Ramana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ నందు శుక్రవారం తెలంగాణ న్యాయాధికారుల సదస్సు 2022 జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారనీ, కానీ తెలంగాణలో కేసిఆర్ మాత్రం 4,320 కిపైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. చేతికి ఎముకలేని తనానికి ట్రైడ్ మార్క్ గా సీఎం కేసిఆర్ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసిఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇటీవల హైదరాబాద్ లో అంతర్జాతీయ అర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చిందని, వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని జస్టిస్ రమణ అన్నారు.

CJI Justice NV Ramana appreciated cm kcr
CJI Justice NV Ramana appreciated cm kcr

CJI Justice NV Ramana: సీజేఐ జస్టిస్ వెంకట రమణకు సీఎం కేసిఆర్ కృతజ్ఞతలు

న్యాయవ్యవస్థ ను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ తెలిపారు. తెలంగాణ హైకోర్టులో రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామన్నారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామని చెప్పారు. కేసుల సత్వర పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరమని అన్నారు. సీఎం కేసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ను పెంచినందుకు సీజేఐ జస్టిస్ వెంకట రమణకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. న్యాయవ్యవస్థ సమర్ధంగా పని చేయడం కోసం అదనపు సిబ్బందిని మంజూరు చేసినట్లు వివరించారు కేసిఆర్. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి 33 జిల్లాలలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా జిల్లాల్లో కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. జిల్లా కోర్టు భవనాల కోసం స్థల సేకరణ జరుగుతోందని, హైకోర్టు జడ్జి లకు హోదాకు తగ్గ స్థాయిలో 42 మంది జడ్జిలకు క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు కేసిఆర్. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తోందని ఈ సందర్భంగా వివరించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!