CM KCR: సెప్టెంబర్ 1న హస్తినకు పయనమవుతున్న తెలంగాణ సీఎం కేసిఆర్..! ఎందుకంటే..?

Share

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసిఆర్ మరల సెప్టెంబర్ 1వ తేదీన వెళుతున్నారు. ఈ సారి కేసిఆర్ ఢిల్లీకి వెళ్లడంలో ప్రాధాన్యత ఉంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో  కేసిఆర్ ప్రత్యేక విమానంలో బేగంపేట నుండి బయలుదేరతారు. కారణం ఏమిటంటే సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

CM KCR Delhi tour
CM KCR Delhi tour

ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన పార్టీ కార్యాలయం నిర్మాణానికి గానూ కేంద్ర ప్రభుత్వం 1300 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ భూమిలో పార్టీ భవన నిర్మాణానికి కేసిఆర్ భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మరుసటి రోజు సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అయితే ఈ సారి పూర్తిగా పార్టీ కార్యక్రమంపై వెళుతున్నందున ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలవనున్నారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. తెలంగాణ, ఏపి మధ్య నెలకొన్న నీటి వివాదం, విభజన చట్టం హమీల పరిష్కారం తదితర విషయాలపై కేంద్ర పెద్దలతో కేసిఆర్ భేటీ అవుతారా లేదా అనేది నేడో రేపో తెలియనుంది.

ఇవి కూడా చదవండి..

  1. YS Vijayamma: విజయమ్మ ఏం చేయబోతున్నారు..? ఆ మంత్రులకు ఆహ్వానం..!!

2. CM Stalin: దేశానికి ఆదర్శంగా మారుతున్న స్టాలిన్..! సంచలన సాహస అడుగులు..!!

3. Mother tortured son: మాతృత్వానికి మాయని మచ్చ.. ఈ కన్న తల్లి కిరాతకత్వం..


Share

Related posts

బాలయ్య హీరోయిన్స్ ఇలా మారిపోతున్నారేంటి ..?

GRK

Astrology : మీరు పుట్టిన వారమును బట్టి మీ గుణగణాలు తెలుసుకోండి!! (పార్ట్-2)

Kumar

Bigg boss 4: బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ పారితోషకం ఎంతో తెలిస్తే మీ గుండె ఆగిపోవడం ఖాయం

Varun G