దివ్యాంగులకు సీఎం కేసిఆర్ గుడ్ న్యూస్ అందించారు. వచ్చే నెల నుండి దివ్యాంగుల పెన్షన్ రూ.4,116లు ఇవ్వనున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు మంచిర్యాలలో పర్యటించిన సీఎం కేసిఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వచ్చే నెల నుండే వికలాంగులకు పెంచిన పెన్షన్ అందిస్తామని తెలిపారు. మంచిర్యాల గడ్డ మీద నుండే ఈ శుభవార్త ప్రకటించాలని ఇంత కాలం సస్పెన్స్ లో పెట్టినట్లు చెప్పారు.

మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసుకోవడంతో పాటు కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించుకోవడం ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అన్నారు. రెండో విడత దళితబంధు కార్యక్రమాన్ని మంచిర్యాల నుండే శ్రీకారం చుడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ పథకం కింద నియోజకవర్గానికి 11 వందల దళిత కుటుంబాలకు ఆర్ధిక చేయూత అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కుల వృత్తులు చేసుకునే అర్హులైన లబ్దిదారులకు లక్ష ఆర్ధిక సహాయం పథకాన్ని సీఎం కేసిఆర్ ప్రారంభించారు.
ధరణితో రైతుల కష్టాలు తీరినట్లు చెప్పిన సీఎం కేసిఆర్ .. గతంలో పహాణీ నకలు కోసం లంచం ఇవ్వాల్సి వచ్చేదన్నారు. పట్టాల కోసం ఆరు నెలలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉండేదని చెప్పారు. దరణి ఏర్పాటుతో ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పని లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వెంటనే భూముల లావాదేవీల రికార్డు నమోదు అవుతుందన్నారు. అయిదు నిమిషాల్లో పట్టాలు చేతికి వస్తున్నాయంటే ధరణి పుణ్యమేనని, అటువంటి గొప్ప కార్యక్రమాన్ని కాంగ్రెస్ బంగాళాఖాతంలో పడవేయాలని అంటున్నారనీ, ఆ వ్యాఖ్యలు చేసిన వారినే ప్రజలు గిరగిరా తిప్పి బంగాళాఖాతంలో పడవేయాలని పిలుపునిచ్చారు. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ కావాలో, వద్దో ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు.
YS Viveka Case: సీబీఐ కోర్టులో వైఎస్ బాస్కరరెడ్డికి బిగ్ షాక్ .. నో బెయిల్