అమిత్ షా తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ … టీ కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు

Share

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరువేరుగా నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరికపై ముహూర్తం ఖరారు చేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ నెల 21వ తేదీన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం మరువకముందే మరో సీనియర్ కాంగ్రెస్ నేత దోసోజు శ్రావణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరో పక్క టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత టీ కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై భూవనగిరి పార్లమెంట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ని తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుబట్టారు. ఇదే సందర్భంలో అమిత్ షా ను కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు రూ.1400 కోట్ల నష్టం జరిగిందన్నారు. 377 కింద లోక్ సభలో వరద నష్టంపై ప్రస్తావించానని చెప్పారు. తెలంగాణలో ఏరియల్ సర్వే చేయాలని కోరానని, పదవుల కోసం వెంటపడే వాడిని కాదని అన్నారు. తనకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుందన్నారు. కేంద్రం నుండి చాలా నిధులను తీసుకువచ్చానన్నారు.

 

దాసోజు శ్రావణ్ లాంటి మేధావిని పార్టీ నుండి వెళ్లగొడుతున్నారనీ, తనను కూడా పార్టీ నుండి వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తనకు తెలుసునని అన్నారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు వెంకటరెడ్డి. తనకు తెలియకుండా చుండూరులో సభ పెడితే తాను వెళ్లాలా అని ప్రశ్నించారు. తనను రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంపిగా జనం గెలిపించారన్నారు. పార్టీ మారుతున్నానంటూ కూడా ప్రచారం చేస్తున్నారని అన్నారు. పాత కాంగ్రెస్ వాళ్లందరినీ పార్టీ నుండి వెళ్లగొడుతున్నాడంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెదవ పనులు చేస్తున్నారనీ, దీనిపై సోనియా, రాహుల్ గాంధీ దగ్గర తేల్చుకుంటానని వ్యాఖ్యానించారు. వెంకటరెడ్డి. కాంగ్రెస్ వాళ్లంతా పోతే .. టీడీపీ వాళ్లను చేర్చుకుంటారని అన్నారు. తాను పార్టీ మారేది ఉంటే బరాబర్ చెప్పి వెళ్తానని, ఎవరికీ భయపడనని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హూజూరాబాద్ లో రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా స్పందించలేదని, అక్కడ ఎన్ని రోజుల తర్వాత సభ పెట్టారని ప్రశ్నించారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

8 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

30 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago