తొందరపడిన ఓ కోయిల ముందే కూసింది..

Share

తొందరపడిన ఓ కోయిల ముందే కూసింది .. అంటే ఇదే. ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న సామెత మాదిరిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి వ్యూహ, ప్రచార కమిటీని కాంగ్రెస్ నియమించింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలో దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, అనిల్, సంపత్ సభ్యులుగా కమిటీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ప్రకటించారు.

 

వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు అధికారికంగా పంపాలి. ఆ తరువాత ఆయన ఆమోదించాలి. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘంకు పంపాలి. ఆ తదుపరి కేంద్ర ఎన్నికల సంఘం ఆరు నెలలలోపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇంత తతంగం ఉంటుంది. రాజగోపాల్ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదిస్తారా..? వెంటనే ఉప ఎన్నిక వచ్చేస్తుందా..? అనేది చూడాలి. దుబ్బాక, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఈ సారి మునుగోడు ఉప ఎన్నికల్లోనూ తమ హవా కొనసాగించాలని వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. అధికార టీఆర్ఎస్ .. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక గెలుపు స్పూర్తిగా మునుగోడులో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది.

ఇక కాంగ్రెస్ పార్టీ ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నుండి వెళ్లిపోవడమే కాకుండా పార్టీ ని తీవ్ర స్థాయిలో విమర్శించినందున నియోజకవర్గంలో ఆయన ఆధిపత్యాన్ని దెబ్బకొట్టి పార్టీ సత్తా చూపించాలని భావిస్తొంది. అందుకే ఇతర రాజకీయ పక్షాల కంటే ముందే స్ట్రాటజీ, ప్రచార కమిటీని నియమించింది. అయితే ఈ ప్రచార, వ్యూహ కమిటీలో పార్టీలో ఎంపిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానం కల్పించలేదు. చూడాలి ఎమి జరుగుతుందో. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అంశం హాట్ టాపిక్ గా నడుస్తొంది.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

36 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

58 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago