Congress Working Committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశానికి సర్వం సిద్దం అయ్యింది. రెండు రోజుల పాటు హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే హైదరాబాద్ లో జరిగే మొదటి సీబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొంటున్నారు. మొత్తం 90 మంది ప్రతినిధులు హజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో సమావేశాలకు వచ్చే సభ్యుల కోసం తాజ్ కృష్ణతో పాటు తాజ్ డెక్కన్, తాజ్ బంజారా, హయత్ ప్లేస్ లలో ఏర్పాట్లు చేశారు.

సీడబ్ల్యుసీ సమావేశాలకు వచ్చే అతిధుల కోసం తెలంగాణ వంటలతో కూడిన విందును టీపీసీసీ ఇవ్వనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రానుండటంతో తాజ్ కృష్ణలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాల సందర్భంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలకు వ్యూహరచనపై పార్టీ చర్చించనున్నది. గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు అందించనుంది. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అయిన తర్వాత భారత్ జోడో యాత్ర 2.0 ను చేపట్టంపై కూడా కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 17న (ఆదివారం) సీడబ్ల్యుసీ సమావేశం ముగిసిన అనంతరం తుక్కగూడలో విజయభేరి సభకు నేతలు హజరుకానున్నారు. ఈ సందర్భంగా అయిదు గ్యారెంటీ స్కీమ్ లను సోనియా గాంధీ ప్రకటించనున్నారు.

సోనియా, రాహుల్ తో భేటీ కానున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవేళ సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో తాజ్ కృష్ణలో సమావేశం కానున్నట్లు తెలుస్తొంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ చేరుకున్న కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పార్క్ హైయత్ లో నిన్న రాత్రి వైఎస్ షర్మిల సమావేశమైయ్యారు. పార్టీ విలీనంపై కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాలని షర్మిల డిసైడ్ అయినట్లు గా తెలుస్తొంది.
పార్టీ విలీనం అంశంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పర్యటన పూర్తి అయ్యేలోపు ఒక స్పష్టత ఇచ్చేయాలన్న షర్మిల భావిస్తున్నారుట. ఈ క్రమంలో మరో సారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల ఇవేళ సమావేశమై చర్చించనున్నారని సమాచారం. గత నెల 31వ తేదీ ఢిల్లీలో సోనియా, రాహుల్ లతో షర్మిల ఒక సారి సమావేశమై పార్టీ విలీనంపై చర్చలు జరిపారు. అంతకు ముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి చర్చించారు. తాజా భేటీ తర్వాత షర్మిల పార్టీ విలీనంపై అధికారిక ప్రకటన వెల్లడి చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Nara Bhuvaneswari: చంద్రబాబుతో భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరణ .. కారణం ఏమిటంటే..?