Desha Encounter Case police told lies
Desha Encounter Case: దిశ ఎన్ కౌంటర్ పచ్చి బూచకమని. పోలిసులే నిందితులను కాల్చి చంపి దాన్ని ఎన్ కౌంటర్ గా కథ అల్లినట్లు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. 2019 నవంబర్ 27న హైదరాబాద్ లో పశువైద్యురాలిని కొందరు సామూహిక అత్యాచారం చేసి హత మార్చిన ఘటనలో మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు నిందితులుగా పేర్కొని పోలీసులు నవంబర్ 29న అరెస్టు చేశారు. వారి అరెస్టు జరిగిన వారం తరువాత డిసెంబర్ 19న పోలీసుల కాల్పుల్లో వారు హతమైయ్యారు. కోర్టు అనుమతితో కస్టడీ విచారణ కొరకు నిందితులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు డిసెంబర్ 6వ తేదీన సీన్ రీకన్సస్ట్రషన్ కొరకు ఘటనా స్థలం వద్దకు తీసుకువెళ్లారు. అయితే ఆ సమయంలో నిందితులు పోలీసుల నుండి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందనీ, దాంతో నిందితులు నలుగురు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ జరిగిన ఎన్ కౌంటర్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇది ఫేక్ ఎన్ కౌంటర్ గా తేల్చారు. పోలీసులు చెప్పిన విషయాల్లో చాలా అంశాలు నమ్మలేనివి, కల్పితాలు చెప్పినట్లుగా గుర్తించారు.
*నిందితులను నవంబర్ 29న అరెస్టు చేసిన తరువాత షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో వారి నుండి నేర అంగీకార స్టేట్ మెంట్ రికార్డు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. ఆ తరువాత పది రోజుల పోలీసు కస్టడీ విచారణకు కోర్టు అనుమతి తీసుకున్నారు. నిందితులకు ప్రజల నుండి ప్రాణ హాని ఉందన్న అనుమానంతో వారిని డిసెంబర్ 5న సురక్షిత గృహానికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే నలుగురు నిందితులను ఏసీపీ సురేందర్ విచారించారని పోలీసు డైరీలో, అఫిడవిట్ లో పేర్కొనగా సదరు ఏసీపీ అక్కడకు రాలేదని ప్యానల్ గుర్తించింది. విచారణను మరోక పోలీసు అధికారి వెంకట రెడ్డి అనే అసిస్టెంట్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి చేశారని పోలీసులు తర్వాత పేర్కొన్నప్పటికీ వివరణాత్మక విచారణకు తగిన రికార్డులు లేనందున ప్యానెల్ ఈ వాదనలో నిజం లేదని తేల్చింది.
*ఎన్ కౌంటర్ హత్యలను విచారిస్తున్న దర్యాప్తు అధికారి కే సురేందర్ రెడ్డి తాము స్వాధీనం చేసుకున్న దిశ వస్తువులను ఆమె సోదరి దృవీకరించినట్లు చెప్పగా ఈ విషయంలో అతను దిశ సోదరి వాంగ్మూలాన్ని నమోదు చేయలేదని కమిషన్ గుర్తించింది. దిశ వస్తువులపై అనుమానితుల వేలి ముద్రలు సేకరణ చేయలేదనీ, వాటిని ఫారెన్సిక్ పరీక్షలకు పంపలేదని సురేందర్ రెడ్డి చెప్పారు. అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్ డిసెంబర్ 6న ఎన్ కౌంటర్ స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిశ కు సంబంధించిన వస్తువులు పొదల్లోంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కానీ కమిషన్ దీని గురించి ప్రస్తావించినప్పుడు దృవీకరించలేదు.
*ఘటనా స్థలంలో నిందితులు తమ కళ్లల్లో మట్టి చల్లి తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు. గణనీయ సంఖ్యలో సాయుథ పోలీసులు ఉండగా వారి కళ్లల్లో మట్టి చల్లి పారిపోయే ప్రయత్నం చేశారనేది వింతగా ఉందని ప్యానల్ పేర్కొంది. వాస్తవానికి పోలీసులు చూపిన స్థలంలో కలుపు మొక్కలతో నిండిన బీడు భూమిగా ఉండగా అక్కడ నుండి పోలీసుల అధికారుల కళ్లలోకి విసిరేంత మట్టిని తీయడం అసాధ్యమని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా విచారణ నివేదికలో మట్టి ప్రస్తావన లేదు,
*ఘటనా స్థలంలో అరవింద్ గౌడ్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్ర గాయాలు అయినట్లు సీపీ సజ్జనార్ తెలపగా ప్యానల్ విచారణలో అనేక అనుమానాలు వచ్చాయి. గాయపడినట్లు పోలీసులను అంబులెన్స్ లో కాకుండా పోలీసు జీపులో తరలించారు. ఆసుపత్రుల్లో వారి పరీక్షలకు సంబంధించి రిపోర్టులు విరుద్దంగా ఉండటం కమిషన్ గుర్తించింది.
*నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల నుండి పిస్టల్ లాక్కున్నారన్న ఆరోపణలను కమిషన్ విశ్వసించలేదు. పోలీసులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని కమిషన్ విచారణలో తేలింది. పోలీసులు ఆరోపించినట్లుగా నిందితులు పోలీసు అధికారుల నుండి పారిపోతున్నప్పుడు వారిపై కాల్పులు జరపడం అసంభవమని కమిషన్ గుర్తించింది. పోలీస్ పార్టీ కాల్చిన బుల్లెట్ల వల్లనే వారు మరణించారని ప్యానెల్ నిర్ధారించింది. పోలీసులు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల్లో పలు వైరుథ్యాలను ప్యానల్ గుర్తించింది. కాల్పులు జరిపిన దూరం, ఘటనా స్థలం నుండి లభ్యమైన బుల్లెట్ లు, కాట్రిడ్జ్ ల సంఖ్య పై వ్యత్యాసాలను కమిషన్ నమోదు చేసింది.
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…