NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కమలం గూటికి దివ్యవాణి..? ఈటలతో భేటీ అందుకే(నా)..!

ఏపి తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సినీ నటి దివ్యవాణి కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వీడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయలేదు కానీ ఆయన కోటరీలోని ఓ ముఖ్యనేతపై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చేశారు. ఆయితే ఉండేది హైదరాబాద్ అయినప్పటికీ గుంటూరు జిల్లా తెనాలి కావడంతో ఏపి రాజకీయాల్లోకి వచ్చారు.  2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన దివ్యవాణి  తన  సినీ గ్రామర్ కు తోడు వాక్ చాతుర్యం ఉండటంతో టీడీపీ అధికార ప్రతినిధిగా నియమితులైయ్యారు. మీడియా సమావేశాల్లో అధికార పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేసి టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.

Divya Vani

 

పార్టీ మహానాడు లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఇతర కారణాలతో అవమానానికి గురయ్యానంటూ ఆరోపణలు చేసి మే నెలలో పార్టీని వీడారు. ఆ తర్వాత వైసీపీలో చేరతారని వార్తలు వచ్చినప్పటికీ ఆ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తన స్థిర నివాసం హైదరాబాద్ కావడంతో తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావించారో లేక జాతీయ పార్టీలో చేరితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించవచ్చని భావించారో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరడానికి సిద్దమైనట్లు సమాచారం. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్  అయిన ఈటల రాజేందర్ తో గురువారం భేటీ అయ్యారు.

Divya Vani BJP

 

రాజకీయాల్లో సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవాలని ఇప్పటికే బీజేపీ సినీ సెలబ్రిటీలకు గేలం వేస్తున్న సంగతి తెలిసిందే.  ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో నితిన్ భేటీ అయ్యారు. ఇక సినీనటి జయసుధ కూడా కమలం తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమైయ్యారు కానీ కొన్ని డిమాండ్ లు పెట్టినట్లు సమాచారం. ఈ తరుణంలో దివ్యవాణి షామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో దివ్యవాణిని బీజేపీలోకి ఈటల ఆహ్వానించినట్లు తెలుస్తొంది. దివ్యవాణి కూడా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక పార్టీ కండువా కప్పుకునే ముహూర్తం ఎప్పుడు..ఎవరితో కప్పించుకుంటారు .. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Divyavani Resign: చంద్రబాబుకు దివ్యవాణి రాజీనామా లేఖ.. మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?