KCR: కేసీఆర్ మ‌రిచిపోయిన లాజిక్ ఏంటో తెలుసా?

Is this KCR strategy
Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. వారిని దైర్యంగా ఉండాలని సూచించారు. కరోనా నివారణకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ స‌మ‌యంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందు కీల‌క ప్ర‌తిపాద‌న ఒక‌టి వ‌చ్చిప‌డింది.

కేసీఆర్ గాంధీని సంద‌ర్శించడమే కాకుండా…

సీఎం హోదాలో గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన కేసీఆర్ దాదాపు నలభై నిమిషాల పాటు గాంధీలో కరోనా చికిత్స ఏర్పాట్లను గమనించారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో కరోనా రోగులకి చికిత్స అందిస్తున్న వైద్యులకి, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ స‌ర్కార్‌ను టార్గెట్ చేసిన నేత‌ల‌కు గులాబీ ద‌ళ‌ప‌తి ఈ ర‌కంగా స‌మాధానం చెప్పిన‌ట్లు అయింది.

ఇదొక్క‌టి చేసేస్తే…

తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లుకు ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకుంది.. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు చేసిన‌ట్లే ఆరోగ్య శ్రీ సైతం అమ‌లు చేస్తే తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క‌ ముంద‌డుగు వేసిన‌ట్లు అవుతుంద‌ని, అంతేకాకుండా విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చున‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.


Share

Related posts

వేలంలో భారీ ధ‌ర ప‌లికిన మ‌హాత్మా గాంధీ క‌ళ్ల‌ద్దాలు..!

Srikanth A

Ys Jagan: జగన్ మరో సెన్సేషన్.. ఫ్రీగా వ్యాక్సిన్..!!

sekhar

ఏలూరులో అంతా డిశ్చార్జీ … అస‌లేం జ‌రిగిందంటే…

sridhar