Eatela Rajendar: ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యానికి అయోధ్య రాముడికి లింక్ ఏంటో తెలుసా?

Share

Eatela Rajendar: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇలాకా అయిన హుజురాబాద్ గ‌త కొద్దికాలంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ముందుకు సాగుతున్నాయి. తాజాగా బీజేపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లంత‌కుంట‌ మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈ ఊరి ఓట్ల డబ్బాలు చూస్తే పువ్వు గుర్తు మాత్రమే ఉండాలని అన్నారు.

Read More : KCR: మోత్కుప‌ల్లికి కేసీఆర్ కండువా క‌ప్పేది అందుకేనా?

స‌ర్వేలో ఈట‌ల రాజేంద‌ర్ గురించి ఏం తేలిందంటే..
హుజూరాబాద్‌ లో టీఆర్‌‌ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్‌‌కే ఓటు వేయాలని ఆయన చెప్పారు.
ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండానే డబ్బులు పంచున్నారని, అవి తీసుకుని ఓటు ఈటల రాజేందర్‌‌కే వేయాలని కోరారు. సర్వే చేయిస్తే మొన్న ఈటలకు మద్దతు 62 శాతం ఉంటే ఈ రోజు 75 శాతానికి చేరిందని చెప్పారు.

Read More : KCR: కేసీఆర్ ఇంకో వ‌రాల జ‌ల్లు… ఈసారి బీసీల వంతు.

ఈటల గెలిచాక ఆయోధ్య రాముడి దర్శనానికి…

రామన్న పల్లి వాసులంతా రాముని వారసులని అన్న సంజయ్.. ఎవరికి వారు ఓట్లు వేయడమే కాకుండా మిగతా వారికి కూడా చెప్పి బీజేపీకి ఓటు వేయించి ఈటలను గెలిపించాలని బండి సంజ‌య్‌ కోరారు. ఈటల గెలిస్తే రామన్నపల్లి నుంచే విజయ యాత్ర మొదలపెడతామని ఆయన చెప్పారు. ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి సాక్షిగా చెబుతున్నానని, ఈటల కచ్చితంగా గెలుస్తున్నారని అన్నారు. రాజేంద్రన్న గెలిచిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని.. నేరుగా అయోధ్య రాముడిని దర్శించుకుంటామని చెప్పారు. ‘‘ఈటల రాజేందర్ భయంతో సీఎం కేసీఆర్ తెల్లవారు జామున నిద్రపోతున్నాడట. రోజు రోజుకు సర్వేలో ఈటల గ్రాఫ్ పెరుగుతోందని తెలిసి భయపడిపోతున్నాడు. ప్రతి సర్వేలోనూ పువ్వు, రాజేందర్ పేరు తప్ప మరొకటి లేకపోవడంతో ఆయనకు నిద్ర పట్టడం లేదు” అని బండి సంజయ్ అన్నారు.


Share

Related posts

BREAKING: రామ్ చరణ్ – శంకర్ ల సినిమా టైటిల్ ఇదే — అద్దిరిపోయేలా ఉంది..!

amrutha

Bigg Boss 5 Telugu: లహరి హౌస్ నుండి ఎలిమినేట్ అవటానికి కారణం అదే అంటున్న జనాలు..!!

sekhar

పరిటాల రవి కుటుంబంలో విషాదం

Mahesh