Eatela Rajendar: రాజ‌కీయాల్లో ఆత్మ‌హత్య‌లే…ఈట‌ల రాజేంద‌ర్ ఉదంతం అదే చెప్తోంది

Share

Eatela Rajendar: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్, ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన హుజురాబాద్‌లో జ‌ర‌గ‌బోయే ఉప‌ ఎన్నిక ఎంద‌రిలోనో ఆస‌క్తి రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటు బీజేపీ నేత‌లు అటు టీఆర్ఎస్ నేత‌లు ఈ ఎన్నిక కేంద్రంగా విమ‌ర్శ‌లు , ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే, తాజాగా సీఎం కేసీఆర్ న‌మ్మిన‌బంటు అనే పేరున్న ఓ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ ముఖ్య నేత‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తాజాగా మాజీ మంత్రి ఈట‌లపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

Read More : Eatela Rajendar: హుజురాబాద్‌లో ఇంటెలిజెన్స్ స‌ర్వే… ఈట‌ల గురించి ఏం తేలిందంటే…


ఈట‌ల రాజేంద‌ర్ ది అత్యాశ‌
హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపుర్‌ మండల దళిత నాయకులతో సమావేశమైన వినోద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయం గా ఈటలకు సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాలను ఈటల తన స్వార్థానికి వాడుకున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఒక మంత్రి హోదాలో ఉండీ ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడంతోపాటు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ ఎంతో సహనం పాటించి ఈటల చర్యలను ఓపిగ్గా భరించారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఆశపడటం సహజమే. కానీ, ముఖ్యమంత్రి పదవిపై ఈటల రాజేందర్‌ అత్యాశపడ్డారని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.

Read More : KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుంది.. . దానికి ఉదాహ‌రణ ఇదే!

ఈట‌ల విష‌యంలో ఆత్మ‌హ‌త్య‌లే..
టీఆర్‌ఎస్‌ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే చర్యలకు ఈటల పాల్పడుతుండటంతో తదుపరి పరిణామాలు తప్పలేదని వినోద్ కుమార్‌ పేర్కొన్నారు. తిన్నింటి వాసాలు లెక్కించే ఈటల వంటి నాయకుల చర్యలు ఎవరూ భరించలేరని స్పష్టం చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. కేవలం ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి ఈటల రాజేందర్‌ విషయంలో సరిగ్గా సరిపోతుందని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. దీనిపై ఈట‌ల రాజేంద‌ర్ ఆండ్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.


Share

Related posts

Rajini Kanth : స్పీడ్ పెంచిన సూపర్ స్టార్ రజినీకాంత్..!!

sekhar

థమన్ మళ్ళీ అడ్డంగా బుక్కయ్యాడా ..ఈసారి వదలరేమో ..?

GRK

YS Jagan : వాలంటీర్ల విషయంలో జగన్ కు సీపీఐ రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ .. జగన్ ఏమి సమాధానం చెబుతారో? 

somaraju sharma