Eatela Rajendar: త‌మ‌లపాకుతో ఈట‌ల … త‌లుపుచెక్క‌తో కేసీఆర్‌…

Share

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. త‌న మంత్రివర్గ స‌హ‌చ‌రుడు ఈట‌ల రాజేంద‌ర్ ను ప‌ద‌వి నుంచి తొల‌గింపు అనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ఎదురైన షాకుల‌కు ఈట‌ల రాజేంద‌ర్ సైతం అదే రీతిలో స్పందించారు. అయితే, త‌మ‌లపాకుతో ఈట‌ల స్పందిస్తుంటే త‌లుపుచెక్క‌తో కేసీఆర్ స్పందిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈట‌ల వ్యూహాలు…

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వివిధ రాజకీయ పార్టీల సీనియర్ నేతలతో వరు స భేటీలు జరుపుతున్నారు. వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేతల వద్ద కు ఆయన వెళ్తూ, రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తూ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కేబినెట్ నుంచి బర్తరఫ్ కు గురైన తర్వాత ఈటల తన నియోజకవర్గం హుజురాబాద్ లో మూడు రోజుల పాటు ఉన్నారు. అక్కడే తన అనచరులు, ముఖ్య నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు. తిరిగి హైదరాబాద్ వచ్చిన ఆయన.. హుజురాబాద్ కు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామ, మండల స్థాయి నాయకులను తన నివాసానికి పిలిపించుకొని సమావేశమయ్యారు.

వాళ్లే ఎదురు తిరిగారుగా…

అయితే, సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన హుజురాబాద్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హుజురాబాద్‌లో ఈటలను పలువురు టీఆర్ఎస్‌ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ పలువురు కార్పొరేటర్లు ఈటల కు వ్యతిరేకంగా తీర్మానం చేసారు. తామంతా టీఆర్ఎస్ బీ ఫార్మ్ తోనే గెలిచామని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటామని టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈట‌ల రాష్ట్రస్థాయిలో వ్యూహం పన్నుతుంటే క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న‌కు కేసీఆర్ షాకులు ఇస్తున్నారంటున్నారు.


Share

Related posts

చెత్త పనికి చెత్త ఫలితం..!జాతీయస్థాయిలో పరువుకి భంగం..!?

Muraliak

‘అడుక్కోవడం కాదు పోరాడి సాధించాలి’

somaraju sharma

Sreekaram : ప్రీ బిజినెస్ తో రికార్డులకు “శ్రీకారం” చుట్టిన శర్వానంద్..! రేపే విడుదలకు సిద్ధం..!!

bharani jella