Eatela Rajendar: ఈట‌ల కుట్ర చేశారు… సంచ‌ల‌న కామెంట్లు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Share

Eatela Rajendar: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్ నేత‌ల‌కు టార్గెట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈట‌లను టార్గెట్ చేయ‌డంలో నేత‌లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాల్క సుమన్ త‌మ పార్టీ మాజీ మంత్రిపై ఫైర్ అయ్యారు. సుమన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ… మాజీ మంత్రి ఈట‌ల పై విరుచుకుప‌డ్డారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దొర అంటూ కామెంట్లు

ఈట‌ల‌పై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ గతంలో బీజేపీని విమర్శించి ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో ఎందుకు చేరారంటూ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​పట్ల ఈటల రాజేందర్ వాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తల్లి లాంటి పార్టీ, తండ్రి లాంటి కేసీఆర్‌ను తిట్టడానికి నోరెలా వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈటలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల రాజేంద‌ర్‌కు అదిరిపోయే షాకులు రెడీ చేస్తున్న కేసీఆర్‌

ఈట‌ల గురించి…
మామూలు కార్యకర్తగా ఉన్న ఈటల.. రాష్ట్రంలోనే నంబర్​2 స్థానంలోకి తీసుకు వచ్చింది ఎవరని బాల్క సుమ‌న్‌ అన్నారు. ఒంటి మామిడిలో మీ మెడికల్ కాలేజీకి అనుమతి కోసం మేము ప్రయత్నం చేయలేదా.? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల భూములు కబ్జా చేసుకున్నారని చెబితే విచారణకు ఆదేశించడం తప్పా అని ప్ర‌శ్నించారు. ఆర్టీసీ సమ్మె చేయించి ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి యత్నించిన అశ్వత్థామరెడ్డితో గంటల పాటు ఏం మీటింగులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశంలోని విషయాలు బయట పెట్టడం కరెక్టేనా అని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు ముందు నుంచి టీఆర్ఎస్, కేసీఆర్‌కు మద్దుతుగా నిలిచారు. భవిష్యత్‌లోనూ వారు టీఆర్ఎస్‌కు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.


Share

Related posts

మళ్లీ లోకేష్ పై సెటైర్లు..??

sekhar

ప్రభుత్వ జివోలపై సిబిఐ విచారణ జరపాలి: కన్నా

somaraju sharma

ఆర్జీవీపై బిగ్ బాస్ అరియానా షాకింగ్ కామెంట్స్?

Varun G