Eatela Rajendar: ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా? దానికి ముందుం ఏం జ‌రిగిదంటే…

Share

Eatela rajendar: టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసైన్డ్ భూముల ఆక్రమణలు ఎదుర్కొంటూ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన..ఈటల ఏం చేయబోతున్నారు అనేదే ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌. మొద‌ట ఆరోగ్య శాఖ మంత్రి పదవి పోగా… అనంత‌రం ఏకంగా కేబినెట్ నుంచి సీఎం కేసీఆర్ ఉద్వాసన పలికారు. అయితే, దీనిపై ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఆయ‌న తీసుకోబోయే నిర్ణ‌యంపై ఆస‌క్తి నెల‌కొంది.

ఆరోప‌ణ‌ల‌పై క్లారిటీ

ఈట‌ల రాజేంద‌ర్‌పై అసైన్డ్ ల్యాండ్ క‌బ్జా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 66 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించినట్లు కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ తో పాటు..కబ్జా, అటవీ చట్టాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స‌మ‌యంలోనే తాను క‌బ్జా చేయ‌లేద‌ని ఈట‌ల క్లారిటీ ఇచ్చారు.

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా?

విలేక‌రుల స‌మావేశంలో ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచాన‌ని కూడా త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని అందుకే ఎమ్మెల్యే ప‌ద‌వి గురించి సైతం ఆలోచ‌న చేసుకుంటాన‌ని తెలిపారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాత నిర్ణ‌యం ఉంటుంద‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఆయ‌న హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ నేప‌థ్యంలో నేడో రేపో ఈట‌ల ప‌ద‌వికి రాజీనామా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.


Share

Related posts

సుకుమార్ కంటే త్రివిక్రమ్ తోపా ? త్రివిక్రమ్ కంటే సుకుమార్ తోపా ? ఆన్సర్ ఇదే ?

GRK

” వాళ్ళిద్దరూ ” చంద్రబాబు కి టెన్షన్ పెట్టేస్తున్నారు : మోడి – జగన్ కాదు .. వీళ్ళు వేరే !

sekhar

పింకు సామ్రాజ్యానికి కాషాయ గండి..!! కేసీఆర్ కి దుబ్బాక దెబ్బ తగిలినట్టేనా..!?

Muraliak