Eatela Rajendar : కేసీఆర్ కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న ఈట‌ల‌

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team
Share

Eatela Rajendar : టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పొలిటిక‌ల్ అడుగుల‌పై ఆస‌క్తి నెల‌కొంది. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల అనంత‌రం ఈట‌ల రాజకీయ భవిష్యత్‌ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజులుగా మద్దతుదారుల అభిప్రాయాలు తీసుకుంటున్న ఈటల.. పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కీల‌క చ‌ర్చ‌లు

ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ అచ్చంపేటలో వందల ఎకరాలు కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. తాజాగా ఆయనను ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయాలని టీఆర్ఎస్‌కు చెందిన గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో త‌న‌ నియోజకవర్గంలో ఈట‌ల రాజేంద‌ర్ సంప్ర‌దింపులు జ‌రిపారు. మరిన్ని సంప్రదింపుల తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారని.. హైదరాబాద్‌లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది.

ట్విస్టులు కొన‌సాగిస్తున్న ఈట‌ల‌

భాకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి వేటుపడిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. భవిష్యత్ నిర్ణయం గురించి తన సొంత జిల్లాలోని నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ జిల్లాలోని వేలాది మంది ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఏ విధంగా ముందుకు వెళ్లాల‌నే దానిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఉత్కంఠ‌ను మ‌రింత కొన‌సాగించారు.


Share

Related posts

ఎంప్లాయిస్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!!

sekhar

KGF -2 release date : కేజిఎఫ్ -2 వచ్చేస్తోంది గురూ..

bharani jella

Prabhas: వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసం కళ్ళ ప్యాకప్ చెప్పేస్తున్న ప్రభాస్..!!

sekhar