Enforsment directorate: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా 9వ తేదీ విచారణకు హజరు కాలేననీ, 11 వ తేదీ విచారణకు హజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కవిత ఈడీకి లేఖ రాశారు. కవిత లేఖపై ఈడీ స్పందించింది. కవిత విజ్ఞప్తికి ఈడీ ఓకే చెప్పింది. 11వ తేదీ (శనివారం) విచారణకు హజరు కావాలని తెలిపింది. అయితే ఈడీ విచారణకు హజరయ్యేందుకు సంసిగ్దత వ్యక్తం చేస్తూనే కవిత తన కు ఉన్న న్యాయపరమైన హక్కులపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

మహిళలను వర్చువల్ పద్ధతిలో గానీ నేరుగా ఇళ్ల వద్ద కు వెళ్లి దర్యాప్తు అధికారులు విచారణ చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. గతంలో సీబీఐ అధికారులు కవిత ఇంటి వద్దకు వెళ్లి విచారణ జరిపారు. కానీ ఈడీ అధికారులు మాత్రం తమ కార్యాలయానికి విచారణ కు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై తమ న్యాయవాదులతో బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. మరో పక్క బీఆర్ఎస్ లీగల్ సెల్ కవితకు ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో పలువురు ముఖ్య నేతలను ఇప్పటికే ఇడీ, సీబీఐ అరెస్టులు చేస్తున్న క్రమంలో కవిత ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్న కారణంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడమే మేలని భావిస్తున్నారు.
మరో పక్క రేపు జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నా కోసం కవిత ఢిల్లీకి చేరుకున్నారు. కవిత ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి 16 పార్టీలు, 29 సంఘాల నేతలకు అహ్వానాలు అందాయి. బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాళీదళ్, టీఎంసీ, జేడీయు, ఆర్జేడీ, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డీ, జేఎంఎం పార్టీ ప్రతినిధులు హజరవుతారని కవిత కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Political Survey: బాబు ఇలాకాలో జగన్ హవా .. తాజాగా వచ్చిన సర్వేలోనూ అదే లెక్క..!