NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి ఈడీ సమన్లు .. సమన్లపై కవిత రియాక్షన్ ఇదీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీసెంట్ గా నాల్గో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ .. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి నోటీసులు జారీ చేసింది. రేపు (మంగళవారం) ఈడీ ముందు విచారణకు హజరు కావాలని కవితకు నోటీసులో పేర్కొంది.

MLC Kavita

ఇప్పటికే పలు మార్లు నోటీసులు అందుకున్న కవిత.. ఇంతకు ముందు విచారణను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు  రావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత గత ఏడాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. అప్పట్లో సుప్రీం కోర్టు కవిత పిటిషన్ ను విచారణ స్వీకరించి మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కేసు విచారణను వాయిదా  వేసిన నేపథ్యంలో నవంబర్ 20వ తేదీ వరకూ సమన్లు జారీ చేయబోమని ఈడీ కోర్టుకు తెలిపింది. తాజాగా మరో సారి ఇడీ సమన్లు జారీ చేయడంతో కవిత స్పందించారు. ఈ కేసు విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని.. తాను విచారణకు హజరు కాలేనని విచారణాధికారికి ఈమెయిల్ ద్వారా తెలియజేశారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచినట్లు స్పష్టం అవుతోంది. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇటు కవితకు నోటీసులు ఇవ్వడంతో రాజకీయాలు వేడెక్కే అవకాశం కనబడుతోంది. ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేయడమే కేంద్రం ఉద్దేశంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.

Damodara Raja Narsimha: తెలంగాణ మంత్రి దామోదర రాజనర్శింహా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N