TRS MP Nama Nageswara rao: టీఆర్ఎస్ ఎంపి నామా నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

Share

TRS MP Nama Nageswara rao:  టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్ కంపెనీ పలు బ్యాంకుల్లో భారీగా రుణఆలు తీసుకుని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారనే అభియోగాల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు రూ.1064 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసు దర్యాప్తు క్రమంలో భాగంగా నామా కు చెందిన మధుకాన్ గ్రూపు సంస్థలు సహా అయిదు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. నామాతో పాటు రాంచి ఎక్స్ ప్రెస్ వే సీఎండీ కె శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృధ్వీ తేజల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి.

ED raids on TRS MP Nama Nageswara rao house
ED raids on TRS MP Nama Nageswara rao house

Read more: YS Sharmila Parigi tour: చింతపల్లి వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు..! ఎందుకంటే..?

బ్యాంకు ఫ్రాండ్ కేసుపై నామాపై 2019లోనే కేసు నమోదు అయ్యింది. గత ఏడాది సీబీఐ చార్జిషీటు ఫైల్ చేసింది. మధుకాన్ ఇన్ప్రా, మధుకాన్ ప్రాజెక్టు, మధుకాన్ టోల్ వే, ఆడిటర్లను చార్జీషీటులో సీబీఐ నిందితులుగా చేర్చింది. సంస్థల అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించి కీలక సమాచారం కోసం కోసం ఈడి సోదాలను నిర్వహిస్తోంది. ఈ రోజు సాయంత్రం వరకూ ఈ సోదాలు కొనసాగే అవకాశముంది.


Share

Related posts

SBI New Rules: ఎస్బిఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తో ఖాతాదారులకు ఊరట..!!

bharani jella

ఆ రైల్వే స్టేషన్ కి ఎప్పుడైనా వెళ్ళారా? దయ్యాలు చూడాలి అంటే వెళ్ళండి !

Naina

అమరావతి సభకు 22 పార్టీల నేతలు

Siva Prasad