NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ బిగ్ షాక్ .. రేపు మళ్లీ విచారణకు రావాలంటూ..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హజరు అవుతానంటూ సమాధానం ఇచ్చిన రోహిత్ రెడ్డి చివరి నిమిషంలో తనకు సమయం కావాాలంటూ ఈడీకి ట్విస్ట్ ఇస్తూ లేఖ రాశారు. అయితే రోహిత్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించడంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు రోహిత్ రెడ్డి. దాదాపు ఆరు గంటల పాటు రోహిత్ రెడ్డిని ఈడీ అధికారుుల విచారించారు. సోమవారం విచారణ ముగిసిన తర్వాత రేపు మళ్లీ రావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు సూచించారు.

Rohit Reddy

 

సోమవారం ఈడీ అధికారుల విచారణ ముగిసిన తర్వాత రోహిత్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ ఈ రోజు విచారణలో సాంతం తన బయోడేటా గురించి మాత్రమే ప్రశ్నించారని తెలిపారు. తమ వ్యక్తిగత వివరాలతో పాటు వ్యాపార లావాదేవీల గురించి అడిగారని చెప్పారు. అయితే తనను ఏ కేసు గురించి ప్రశ్నిస్తున్నారు అనే విషయం అర్ధం కాలేదనీ, ఎలాంటి ఇల్లీగల్ లావాదేవీల గురించి అడగలేదని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలను సంధించలేదన్నారు. అయితే తనను ఏ కేసులో విచారణ చేస్తున్నారు అనే విషయంపై తానే ప్రశ్నించినా వారు స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రేపు ఉదయం 10.30 గంటలకు మళ్లీ విచారణకు హజరు కావాలని తెలిపారన్నారు. తన వద్ద నుండి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు నకలు కాపీలను తీసుకున్నారన్నారు.

Rohit Reddy

 

తాను అయ్యప్ప దీక్షలో ఉన్నాననీ, ఈ నెల 31వ తేదీ వరకూ దీక్ష సమయం పూర్తి అయిపోతుందని, విచారణకు సమయం కావాలని తొలుత ఈడీని కోరినప్పటికీ వారు తన అభ్యర్ధనను తిరస్కరించారని చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను ఈ రోజు విచారణకు హజరైనట్లు తెలిపారు రోహిత్ రెడ్డి. అయితే రేపు విచారణకు సంబంధించి తన న్యాయవాదులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు రోహిత్ రెడ్డి. ఎఫ్ఐఆర్ కానీ ఇవ్వకుండా, ఏ కేసులో విచారణ జరుపుతున్నారో తెలియజేయకుండా విచారణకు నోటీసులు జారీ చేయడంపై రోహిత్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని అంటున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారుడిగా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీ లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారం తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఆ కేసులో బీజేపీ కీలక నేతలకు సిట్ నోటీసులు జారీ చేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కేసిఆర్ సర్కార్ మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు విచారణలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అంటున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో మేడ్చల్ ఎమ్మెల్యేల రహస్య భేటీ ..! మంత్రి మల్లారెడ్డికి జర్క్ ఇచ్చేందుకే(నా)..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju