NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: ముగిసిన ప్రచార పర్వం .. ప్రలోభాలకు తెర తీసిన అభ్యర్ధులు

Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రచార గడువు చివరి నిమిషం వరకూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరెత్తించాయి. గత నెల రోజుల నుండి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. గత కొన్ని రోజులగా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా తెలంగాణలో మకాం వేసి అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉండగా, కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన జోష్ మీద ఉన్న కాంగ్రెస్ తెలంగాణలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరు గ్యారెంటీలతో ప్రచారం నిర్వహించింది. మరో వైరు రాష్ట్రంలో హంగ్ తప్పుదు .. కింగ్ మేకర్ అవుతామన్న ఆలోచనలో బీజేపీ ఉంది. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర అయిదు రోజులు.. 8 సభలు, ఒక రోడ్ షోలో పాల్గొని క్యాడర్ లో జోష్ నింపారు. కేంద్ర మంత్రి అమిత్ షా 8 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని 17 సభలు, ఏడు రోడ్ షాలలో ప్రసంగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అయిదు రోజులు, 8 సభలు, మూడు రోడ్ షోలలో పాల్గొన్నారు. ఇంకా బీజేపీ తరపున కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, సాద్వీ నిరంజన్ జ్యోతి, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి అదిత్యనాద్, ప్రమోద్ సావంత్, ఏక్ నాథ్ శిండే, హిమంత బిశ్వ శర్మ పలు నియోజకవర్గాల్లో అభ్యర్దుల తరపున ప్రచారం నిర్వహించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రం మొత్తం పది సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ 23 సభల్లో, ప్రియాంక గాంధీ 26 సభల్లో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 55 సభల్లో, కర్ణాటక సీఎం సిద్దా రామయ్య మూడు సభల్లో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 10 సభల్లో, చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భఘేల్ నాలుగు సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని ప్రజలకు వాగ్దానం చేశారు నేతలు.

అధికార బీఆర్ఎస్ ఎన్నికల షెడ్యుల్ విడుదలకు ముందు నుండే ప్రచారంలో దూసుకు వెళ్లింది. పార్టీ అధినేత, సీఎం కేసిఆర్, మంత్రులు కేటిఆర్, హరీష్ రావు రాష్ట్రంలో సుడి గాలి పర్యటనలు చేశారు. సీఎం కేసిఆర్ ఏకంగా 96 బహిరంగ సభల్లో పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ 30 సభలు, 70 రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక అభ్యర్ధులు, నేతలు ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తమను ఎన్నుకుంటే ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరిస్తూ ప్రత్యర్ధి పార్టీ అధికారంలోకి వస్తే జరిగే నష్టాలను కూడా ప్రజల ముందు ఉంచారు.

ప్రచార పర్వం ముగియకముందే పలు నియోజకవర్గాల్లో ప్రలోభాలకు తెరలేపారు. ఓటుకు రూ.1000 ల నుండి రూ.3,4వేల వరకూ కీలక నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ప్రలోభాలను అరికట్టేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నా గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రత్యర్ధి పార్టీ నేతలు డబ్బు పంపిణీ చేస్తుంటే నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. నగదుతో పాటు ఓటర్లకు బహుమతులు కూడా పలు నియోజకవర్గాల్లో అందజేస్తున్నారు.

CM KCR: సొంత నియోజకవర్గంలో సీఎం కేసిఆర్ కీలక హామీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N

‘ కాసు మ‌హేష్ ‘ కు ఘోర అవమానం… ఈ సారి గుర‌జాల‌లో ద‌బిడి దిబిడే..!