Enforcement directorate: క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీన విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొంది ఈడీ. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణపై గతంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుల పలు మార్లు చీకోటి ప్రవీణ్ ను విచారణ జరిపిన ఈడీ అధికారులు .. తాజాగా థాయ్ లాండ్ ఘటన నేపథ్యంలో మరో సారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చీకోటితో పాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉందని భావిస్తున్న చిట్టి దేవందర్, మాధవరెడ్డి, సంపత్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసుల నేపథ్యంలో సంపత్ నేడు విచారణకు హజరైయ్యారు. మిగిలిన ముగ్గురు విచారణకు హజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. ఇప్పటికీ చీకోటి ప్రవీణ్ విదేశాలలో ఉన్నట్లు సమాచారం. థాయ్ లాండ్ లో చీకోటి ప్రవీణ్ సహా పలువురు అరెస్టు కావడం, వారికి అక్కడి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
పరస్పర విమర్శలు .. బీజెేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈసీ నోటీసులు