Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి కీలక ఆధారాలను సేకరించిన ఈడీ .. కవిత స్వాధీనం చేసిన ఫోన్‌లలోని డేటాను పరిశీలించేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. ఈ నెల 21వ తేదీన విచారణ సందర్భంలో కవిత 9 ఫోన్లను ఈడీ అధికారులకు స్వాధీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ లలోని డేటాను తెలుసుకునేందుకు గానూ ఈడీ సిద్దమై కవితకు లేఖ రాశారు. ఫోన్ లు ఓపెన్ చేసే సమయంలో స్వయంగా హజరు కావాలని చెప్పారు. వ్యక్తిగతం గా హజరు కాలేని పక్షంలో తన ప్రతినిధిని పంపించాలని కవితకు రాసిన లేఖలో ఈడీ జేడి పేర్కొన్నారు.

ఈ క్రమంలో కవిత తరపున బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈడీ ముందుకు పంపాలని కవిత నిర్ణయించారు.ఇప్పటి ఈడి దర్యాప్తును వ్యతిరేకిస్తూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి దాని ద్వారా దర్యాప్తు జరిపించాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈడీ దర్యాప్తును కవిత ఎదుర్కొన్నారు. ఈ కేసు వివిద రాజకీయ పక్షాల ప్రముఖులు, వ్యాపార ప్రముఖుల చుట్టూ తిరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అవుతోంది.
రాజధాని అమరావతిపై నేడు సుప్రీం కోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ