NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

KCR: కాస్కో కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ సతీమణి జమున సెన్షేషనల్ కామెంట్స్..!!

KCR: ఇటీవల జరిగిన హూజారాబాద్ ఉప ఎన్నికల్లో కేసిఆర్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భూకబ్జా ఆరోపణలతో కేసిఆర్ సర్కార్ ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈటల టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ విజయం సాధించారు. తాజాగా ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ భూముల్లో అధికారులు సర్వే నిర్వహించారు. జమునా హేచరీస్ 70.33 ఎకరాలు అసైన్డ్ భూములను కబ్జా చేసింది నిజమేనని కలెక్టర్ హరీశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కలెక్టర్ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ సతీమణి జమున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటన చేసిన కలెక్టర్ పై కఛ్చితంగా కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు. ఆయన కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు.

 

KCR: మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉన్నాయా..?

కేసిఆర్ సర్కార్ తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించిన ఆమె..కేసిఆర్ సర్కార్ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలు వివరించేందుకు ఇకపై ఈటల రాజేందర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. తమ వ్యాపారాలకు అనుమతులు ఇవ్వవద్దని ప్రభుత్వ పెద్దలే చెప్పినట్లు సాక్షాత్తు అధికారులే చెబుతున్నారని అన్నారు. తాము కొనుగోలు చేసిన సంస్థ భూముల్లో షెడ్లు వేసుకుంటే తప్పేముందని జమున ప్రశ్నించారు. టిఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రులకు పౌల్ట్రీ ఫాంలు ఉన్నాయనీ, వాటన్నింటికీ పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉన్నాయా అని జమున ప్రశ్నించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే సీఎం కేసిఆర్ తనను ఇలా వేధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

హూజూరాబాద్ ఫలితాలే అన్ని చోట్ల రిపీట్ అవుతాయి

హూజూరాబాద్ ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాలే వచ్చే ఎన్నికలలో అన్ని చోట్ల రిపీట్ అవుతాయనీ, ఎదుర్కొవడానిికి కేసిఆర్ సిద్ధంగా ఉండాలని జమున అన్నారు. రాబోయే రోజుల్లో ఈటల రాజేందర్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటిస్తారని జమున పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను కూడా అమ్ముకన్న చరిత్ర తమదని పేర్కొన్న జమున తమ సంస్థ ఇంతకు ముందు తప్పులు చేయలేదు. రాబోయే రోజుల్లోనూ తప్పు చేయదని అన్నారు. తాము కొనుగోలు చేయక ముందు ప్రైవేటు భూములుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న స్థలాలు తాము కొనుగోలు చేసిన తర్వాతా ప్రభుత్వ భూములు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. ఒక జిల్లా కలెక్టర్ గా సర్వే నివేదికలను ప్రభుత్వానికి, కోర్టుకు అందజేయాల్సి ఉండగా, మీడియా సమావేశం పెట్టి తమను అప్రతిష్టపాలు చేయాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రకటన చేశారనీ, దీన్ని తాము ఉపేక్షించేది లేదనీ ఆయన చేసిన తప్పుడు ప్రకటనపై కేసు పెట్టడం ఖాయమని పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju