16.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Etela Rajender: భూ కబ్జా ఆరోపణలపై మంత్రి ఈటెల ఏమన్నారంటే..!!

Etela Rajendar Comments Sensational Comments by Ex Minister
Share

Etela Rajender: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణల దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎక్కడా కబ్జాలకు పాల్పడలేదన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరిగిందని రాజేందర్ ఆరోపించారు. ఏ విచారణకు అయినా తాను సిద్ధమేనని, సిట్టింగ్ జడ్జితోనూ ఆస్తులపై విచారణ చేసుకోమని కోరుతున్నానన్నారు. చిల్లర మల్లర రాజకీయాలకు ఈటెల లొంగిపోడన్నారు. మంత్రిపదవి గడ్డి పూచతో సమానం అని అనను, ఇది గౌరవ ప్రదమైనది కానీ ఆత్మగౌరవం కంటే ఈ పదవి గొప్పదికాదని ఈటెల అన్నారు. ఆరు సార్లు ప్రజా మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొన్నారు.

Etela Rajender press meet
Etela Rajender press meet

అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రుజవు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు పెయిడ్ ఛానల్స్ గా వ్యవహరించి వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమాజానికి తెలియజేయాలని కోరారు. ప్రజల కోసం, ధర్మం కోసం ఈటెల రాజేందర్ కోట్లాడుతాడు కానీ ఎక్కడా రాజీ పడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు..


Share

Related posts

మన్మథుడా నీ కల కన్నా.. అంటున్న దీప్తి సునయన?

Varun G

Ram Charan: డబల్ రోల్ చేయబోతున్న రామ్ చరణ్..??

sekhar

వీడియో లీక్ వ్యవహారంపై ఏపీ సీఐడీకి వైసీపీ ఎంపీ గోరంట్ల ఫిర్యాదు

somaraju sharma