BJP: త్వరలో బీజేపీలో చేరనున్న ఈ మాజీ క్రికెటర్..! పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్..?

Share

ట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఎంపి బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా సీఎం కేసిఆర్, టీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందనరావు గెలుపుతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 40కిపైగా డివిజన్‌లలో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించడంతో పార్టీ మంచి జోష్ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజాబలం ఉన్న తలతో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలు క్రీడాకారులపైనా దృష్టి పెట్టింది.

ex cricketer vvs Lakshman likely to join BJP BJP
ex cricketer vvs Lakshman likely to join BJP BJP

Read More: Covaxin: భారత్ బయోటెక్‌కు డబ్ల్యుహెచ్ఒ షాక్..! ‘కోవాగ్జిన్’ అనుమతులకు మళ్లీ బ్రేక్..! ఎందుకంటే..?

BJP: లక్ష్మణ్ కు బీజేపీ ఆహ్వానం

ఇందులో భాగంగా లక్ష్మణ్ ను బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వివిఎస్ లక్ష్మణ్ పార్టీలో చేరికకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం. హైదరాబాద్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న వివిఎస్ లక్ష్మణ్ ను రాబోయే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుండి  ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తే లక్ష్మణ్ ను సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి బరిలోకి దించాలని పార్టీ యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Read More: Viveka Murder Case: వివేకా హత్య కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ ..! ఈ నలుగురే నిందితులు..!!

వివిఎస్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు

భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన లక్ష్మణ్  2012లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. తరువాత ఐపీఎల్ టోర్నీలో డక్కన్ చార్జెస్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ సన్ రైజర్స్ కు మెంటర్ గా కొనసాగుతున్నారు. క్రికెటర్ గా రిటైర్ అయిన తరువాత లక్ష్మణ్ హైదరాబాదులో అకాడమి ప్రారంభించి యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పలు స్వచ్చంద సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వీవీఎస్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


Share

Related posts

సుప్రీం కోర్టు సాక్షిగా నరేంద్ర మోడీ కి పెద్ద దెబ్బ !!

sridhar

ఏపి కాంగ్రెస్‌లో నిరసన సెగ

sarath

KCR: కరోనా నుండి కాపాడాలని కేసీఆర్ కి సొంత పార్టీ వారి మొర!దొర గారు ఇప్పుడేమంటారో?

Yandamuri