NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

CM KCR: మాజీ మంత్రి మోత్కుపల్లికి కేసిఆర్ సర్కార్ లో కీలక పదవి..? ఇదీ సాక్షం..!!

CM KCR: ఇటీవల జాతీయ పార్టీ బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్శింహులుకు సీఎం కేసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారా ? ఆయనకు కేసిఆర్ సర్కార్ లో కీలక పదవి రానున్నదా ?  అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకు బలమైన ఆధారాలు కూడా కనబడుతున్నాయి. తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం కేసిఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చిన క్రమంలో తొలుత ఏర్పాటు చేసిన సమావేశానికి నాడు బీజేపీలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులులు కేసిఆర్ యే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీ నేతలతో సంప్రదింపులు జరపకుండానే కేసిఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి హజరైయ్యారు. దీంతో అప్పట్లోనే మోత్కుపల్లి బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొద్ది రోజులకే బీజేపీలో అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీపై అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి బీజేపీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ex minister motkupalli likely to get key post in kcr govt
ex minister motkupalli likely to get key post in kcr govt

కేసిఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పథకాన్ని తీసుకువచ్చిన సీఎం కేసిఆర్ ను అభినవ అంబేద్కర్ అంటూ కీర్తించారు. దళితుల అభ్యున్నతికి ఇంత వరకూ ఏ నాయకుడు ఇటువంటి పథకాన్ని తీసుకురాలేదనీ, ఈ పథకాన్ని తీసుకువచ్చిన కేసిఆర్ కు పార్టీలకు అతీతంగా నేతలందరూ కేసిఆర్ కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ విధంగా మోత్కుపల్లి మాట్లాడటంతో ఆయన టీఆర్ఎస్ లో చేరితే కేసిఆర్ సర్కార్ లో కీలక పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. దళిత బంధు పథకానికి చట్టబద్దత కల్పించి, ఆ పథకం అమలునకు చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించాలని కేసిఆర్ భావిస్తున్నారనీ, ఆ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా సోమవారం దళిత బంధు పథకంపై ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మోత్కుపల్లికి సీఎం కేసిఆర్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది.

మోత్కుపల్లి మంచి వాగ్దాటి ఉన్న దళిత నాయకుడు, మాజీ మంత్రియే కానీ ప్రస్తుతం ప్రజా ప్రతినిధి కాదు. అయినప్పటికీ కేసిఆర్ మంత్రులు, అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలను కాదని తన పక్కన మోత్కుపల్లికి ప్రాధాన్యత కల్పించారు. సీఎం కేసిఆర్ కు ఓ పక్కన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మరో పక్క మోత్కుపల్లి నర్శింహులు సమావేశంలో కూర్చున్నారు. ఇంతటి ప్రెయారిటీ మోత్కుపల్లికి కేసిఆర్ ఇచ్చారు అంటే త్వరలో కీలక పదవి ఖాయమనే మాట వినబడుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju