NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: హూజూరాబాద్ లో ఈటల ఎందుకు ఓడిపోవాలో టాప్ సీక్రెట్ చెప్పిన పెద్దిరెడ్డి..

Huzurabad By Poll: బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. చాలా కాలం నుండి కేసిఆర్ తనను ఆహ్వానిస్తున్నారని తెలిపారు పెద్దిరెడ్డి. మంత్రి వర్గం నుండి తొలగించినా ఈటల ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కొనసాగి ఉంటే ఉప ఎన్నిక వచ్చేది కాదన్నారు. నియోజకవర్గ అభివృద్ది, ప్రజలు శ్రేయస్సు కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అధికార టీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని, ఈటల గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు నష్టపోతారని చెప్పుకొచ్చారు.

ex minister peddireddy hot comments on Huzurabad By Poll
ex minister peddireddy hot comments on Huzurabad By Poll

Read More: Karnataka Politics: యడియూరప్ప రాజీనామాను ఆమోదించిన గవర్నర్..! నూతన సీఎం ఎంపికకు బీజేపి అధిష్టానం కసరత్తు..!!

ఎటువంటి హామీ లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాననీ, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపునకు కృషి చేస్తానని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టికెట్ కమిట్మెంట్ తో పార్టీలో చేరడం లేదనీ, బీజేపీలో ఇమడలేకనే టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధానపరమైన విషయాల్లో అధికార పక్షంపై విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. బీజేపీ పట్ల తనకు ఎటువంటి ద్వేష భావం లేదనీ, జాతీయ పార్టీగా గౌరవిస్తామని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే అధికార పార్టీ అభ్యర్థే గెలవాలని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు. ఈటల గెలిస్తే అధికార పార్టీపై గెలిచాననే ఈగో శాటిస్ఫై అవుతుంది తప్ప నియోజకవర్గానికి జరిగే ప్రయోజనం ఉండదని అన్నారు.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన నాటి నుండి అసంతృప్తిగా ఉన్న పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిన్న పార్టీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి నాడు కేసిఆర్ కు సహచరుడుగా ఉన్నారు. త్వరలో హుజారాబాద్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju