Fact Check: “అదుగో పులి అంటే ఇదుగో తోక” అన్న చందంగా సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో అనేక ఫేక్ వార్తలు సెర్క్యులేట్ అవుతున్నాయి. ఓ పక్క కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలను చైతన్య పరుస్తూ కథనాలు, వార్తలు అందించడంతో పాటు ప్రజలకు అవసరమైన వార్తలను అందించకుండా ఎక్కడెక్కడో, ఎప్పుడో జరిగిన సంఘటనలను, వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ అమాయక కానిస్టేబుల్ ను కొందరు యవకులు చితకబాదారు అంటూ ఓ వీడియో లో సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది. అయితే ఉద్దేశపూర్వకంగానే బీజేపీలోని కొందరు ఇటువంటివి వైరల్ చేస్తున్నారంటూ అధికార టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

ఎవరో ఏదో వీడియో పోస్టు చేస్తే అదే నిజమనుకుని మరి కొందరు వాస్తవాన్ని తెలుసుకోకుండా దాన్ని సెర్క్యూలేట్ చేయడం వల్ల అనవసర తలనొప్పులు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ఫేక్ వార్తలు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. ఇటువంటి వార్తలపై ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్ఫింగ్ వీడియోల వల్ల ప్రధాన పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఏపిలో ఓ మాజీ మంత్రి పై మార్ఫింగ్ వీడియోకు సంబంధించి కేసు నమోదు కూడా అయ్యింది.
Read More: YSRCP: ఈడీ కేసులో లేరు.. సాయిరెడ్డికి శాపమా – వరమా..!?
వాస్తవానికి ఈ వీడియోకు హైదరాబాద్ కు అసలు లింకే లేదు. గత ఏడాది అక్టోబర్ నెలలో అహ్మదాబాద్ లో పూటుగా మద్యం సేవించి ఓ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అక్కడి స్థానికులు అతన్ని ఉతికి ఆరేశారు. అయితే కొందరు ఆ వీడియోను హైదరాబాద్ లో సర్క్యులేట్ చేయడంపై సీటీ పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీడియోకు సంబంధించి వార్త ఈ కింద లింక్ లో చూడండి.