తెలంగాణ‌ న్యూస్

Breaking: సికింద్రాబాద్ బైక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం

Share

Breaking: సికింద్రాబాద్ లోని ఓ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూబీ హోటల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బైక్ రూమ్ నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. బైక్ లు దగ్ధం అవుతుండటంతో దట్టమైన పొగలు హోటల్ (లాడ్జీ) లో అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క హోటల్ రూమ్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ లో చిక్కుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.

Fire Accident Secunderabad

 

ఇటీవల కాలంలో అక్కడక్కడా ఎలక్ట్రికల్ బైక్ ల బ్యాటరీలు పేలిపోతూ ప్రమాదాలు గురి అవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్న తరుణంలో ఇ బైక్ షోరూమ్ లోనే అగ్ని ప్రమాదం సంభవించడం ఆందోళన కల్గిస్తొంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హోటల్ లాడ్జీలో ఎంత మంది ఉన్నారు అనేది ఇంకా తెలియరాలేదు. షోరూమ్ పై భాగంలో లాడ్జీలో ఉన్న వాళ్లందరినీ ఫైర్ సిబ్బంది క్షేమంగా బయటకు చేరవేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో పరిసర ప్రాంతాల వారు అక్కడ గుమిగూడటంతో ట్రాఫిక్ అంతరాయం కల్గింది. పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు.


Share

Related posts

ఏపీలో కరోనా వ్యాప్తికి కారణం చెప్పిన చంద్రబాబు?

sekhar

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఎన్టీపీసీ నోటిఫికేషన్..!!

bharani jella

ఆ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నాగచైతన్య.. షాక్‌లో అభిమానులు!

Ram