తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసలే వేసవి కాలం ఎక్కడ ఎప్పుడు అగ్ని ప్రమదం సంభవిస్తుందోనని ఆందోళనలు చెందుతున్నారు. రీసెంట్ గా సికింద్రాబాద్ దక్కన్ మాల్ అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా ఇవేళ రెండు ప్రదేశాల్లో భారీ ప్రమాదాలు చోటుచేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వప్న లోక్ కాంప్లెక్స్ భవనం నందు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ మూడవ అంతస్తులో చెలరేగిన మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్ లతో మంటలు అదుపు చేస్తున్నారు.

చీకటిగా ఉండటంతో లైట్లు వేసుకుని సిబ్బంది నివారణ చర్యలు చేపడుతున్నారు. భవనం లోపల కొందరు చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది చర్యలు వేగవంతం చేశారు. టార్చ్ లైట్ల వెలుతురలో భవనంలో కి వెళ్లారు, క్రైన్ తెప్పించి సహాయక చర్యులు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న వారిలో ఏడుగురుని అగ్ని మాపక సిబ్బంది రక్షించారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స లో మొత్తం ప్రైవేటు కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో పక్క కాంప్లెక్స్ రెండో వైపు ఉన్న కార్యాలాయల్లో నాలుగు, అయిదు, ఆరు అంతస్తుల్లో కొంత మంది ఉద్యోగులు ఇరుక్కుపోయినట్లుగా సమాచారం. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవనం లోపల ఎంత మంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. కాగా విషయం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. భవనం లోపన చిక్కుకున్న ఏడుగురుని ఇప్పటి వరకూ రెస్క్యూ టీమ్ రక్షించారని తెలిపారు. లోపల ఇంకా ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియరాలేదన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. మంటలు అర్పే ప్రయత్నం జరుగుతోందన్నారు.
మరో పక్క జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోపల్లె ఫార్మా రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పరిశ్రమ కొన్నాళ్లుగా మూతపడి ఉండటంతో ప్రాణనష్టం తప్పిందని అంటున్నారు. డ్రమ్ములు పేలుతుండటంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. సాల్వెంట్ డ్రమ్స్ గాలిలోకి ఎగిరి పేలుతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటం, దట్టమైన పొగతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. గతంలో ఈ ఫ్యాక్టరీలో అనుమతి లేకుండా డ్రగ్స్ తయారు చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఎఫిడ్రిన్ తయారు చేస్తూ విదేశాలకు విక్రయిస్తున్న ఈ కంపెనీలో గతంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేసి 400 కేజీల ఎఫిడ్రిన్ ను పట్టుకున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ఫార్మా కంపెనీ మూతపడి ఉంది. 150 డ్రమ్ముల్లో రసాయనాలు స్టోరేజ్ చేయడంతో రియాక్షన్ కారణంగా పేలుళ్లతో భారీ అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి వైసీపీ మంత్రి కారుమూరి సవాల్..!!