Firing: ఆమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. కాల్పుల్లో తెలంగాణ వాసి ఒకరు మృతి చెందారు. మేరీలాండ్ రాష్ట్రంలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రం నల్లగొండకు చెందిన నక్క సాయి చరణ్ (26) మృతి చెందారు. సాయి చరణ్ తన స్నేహితుడిని ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసి కారులో వెళుతుండగా నల్లజాతీయుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ మృతి చెందాడు.
సాయిచరణ్ గత రెండేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. సాయి చరణ్ మృతివార్త తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ఈ ఘటనతో నల్లగొండలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. సాయిచరణ్ భౌతికకాయాన్ని నల్లగొండ తరలించడానికి దేశ అధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అమెరికాలో నల్లజాతీయులు తరచుగా కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో అనేక మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…