Road Accident: ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఐదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వరంగల్లు జిల్లాలో ఇవేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్లు – ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఓ ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ఆటో నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్ సహా మరో నలుగురు దుర్మరణం పాలైయ్యారు. రెండు వాహనాల మధ్య పలువురు ఇరుక్కుపోయ్యారు.

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తొంది. మృతులు తేనె తీసి అమ్ముకునే వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్ కు చెందిన డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Banana: భారీగా పెరుగుతున్న అరటి పండ్ల ధరలు .. డజన్ ఎంతంటే..?