NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana BJP: పార్టీ మారడం లేదని మరో మారు ప్రకటించిన మాజీ ఎంపీ వివేక్ .. బీజేపీలో కొనసాగుతానని స్పష్టీకరణ

Share

Telangana BJP: తెలంగాణ ఎన్నికల వేళ అసంతృప్తిగా ఉన్న పలువురు పార్టీల నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అప్పటి వరకూ విమర్శలు చేస్తూ, తిట్టిన ప్రత్యర్ధి పార్టీలో చేరిపోతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీలో కీలక నాయకులుగా ఉన్న మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ మీడియాలో వార్తలు షికారు చేశారు. ఈ క్రమంలోనే ఇవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

బీఆర్ఎస్ ను వీడి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుందో వివరించారు రాజగోపాల్ రెడ్డి. అయితే పార్టీ మార్పు విషయంలో జరుగుతున్న పర్చారం పై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి స్పందించారు. ఆ ప్రచారం చాలా రోజుల నుండి జరుగుతోందనీ, అదంతా తప్పని అన్నారు. బీజేపీ అభ్యర్ధిగా పెద్దపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తానని వివేక్ స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా గురించి తనకు తెలియదని ఆతన అన్నారు. తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జి వెంకట స్వామి వారసుడుగా రాజకీయాల్లో వచ్చిన వివేక్ 2009 లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆయనను సీఎం కేసిఆర్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అయితే 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధుల ఓటమి కోసం ప్రయత్నిస్తున్నారన్న విమర్శలతో పార్టీ ఆయనను పక్కన పెట్టింది.

దీంతో తనకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గించిన భావించిన వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ పోటీ చేయాలని భావించారనీ, అయితే మొదటి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి వెళతారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ.. తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Komatireddy Rajagopal Reddy: బీజేపీకీ కటీఫ్ చెప్పిన కోమటిరెడ్డి .. మరల కాంగ్రెస్ గూటికి ..


Share

Related posts

రోజా జన్మలో మర్చిపోలేని పని చేసిన రోజా కూతురు… కంటతడి పెట్టుకున్న తండ్రి

Naina

రాజస్థాన్ తరవాత మోడీ – అమిత్ షా కూల్చబోయేది ఆ రాష్ట్ర సర్కార్ నే ? 

sekhar

మణిపూర్ లో చిక్కుకున్న ఏపి విద్యార్ధుల పరిస్థితి పై మంత్రి బొత్స స్పందన ఇది

somaraju sharma