అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫార్ములా ఈ రేసింగ్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేస్ సీసన్ 9 లో జాన్ ఎరిక్ వర్నే విజేతగా నిలిచారు. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి నెల నుండి మొదలైన హడావుడి నేటితో ముగిసింది. రేస్ ను వీక్షించేందుకు సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. మొత్తం రేస్ పూర్తి అయ్యే సరికి 25 పాయింట్లతో జా ఎరిక్ వా మొదటి స్థానంలో నిలవగా, 18 పాయింట్ లతో నిక్ క్యాసిడి రెండో స్థానంలో నిలిచారు.

ఇక 15 పాయింట్ల తో ఆంటోనియో ద కోస్తా మూడో స్థానంలో నిలిచారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రేసర్లకు మంత్రి కేటిఆర్ ట్రోఫీలు అందజేశారు. అఖరి పది ల్యాప్ లకు అభిమానులు కేరింతలు కొడుతూ తమ అభిమాన రేసర్లకు మద్దతు ఇచ్చారు. మొదటి స్థానంలో నిలిచిన జా ఎరిక్ వా హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పోటీలు కావడంతో భద్రతా పరంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి ప్రేక్షకులను విడిచిపెట్టే ముందు క్షుణ్ణంగా తనిఖీలు చేసి తర్వాత లోపలికి పంపించారు.

మొదటి రోజు జరిగిన ప్రాక్టీసు రేసులో త్రుటిలో ప్రమాదం తప్పినప్పటికీ .. రెండో రోజు రేసులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రీ ప్రాక్టీసు రేసు 2 తో రెండో రోజు రేసింగ్ మొదలు కాగా, అనంతరం క్వాలిపైంగ్ రేసుతో రేసర్లు అభిమానులను ఆకట్టుకున్నారు.
Delhi Liquor Scam Case: మాగుంట రాఘవరెడ్డి పది రోజుల ఈడీ కస్టడీ