Road Accident: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ వద్ద జరిగింది. కారు అదుపుతప్పి పల్లీలు కొట్టడంతో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు. చనిపోయిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కృష్ణ, సంజీవ్, సురేష్, వాసులుగా పోలీసులు గుర్తించారు. బ్రతుకు తెరువు కోసం సూరత్ వెళ్లి స్థిరపడిన వీరు బందువుల అంత్యక్రియలకు వచ్చి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తొంది. అన్నదమ్ములు మృతి చెందడంతో చౌటపల్లి గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.

వీరు అయిదు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. బంధువుల అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న వీరు కుటుంబ సభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు నలుగురు తిరిగి సూరత్ కు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఔరంగబాద్ సమీపంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడి పోలీసుల నుండి కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు ఔరంగబాద్ కు బయలుదేరారు.
Amaravati (Guntur): తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత .. హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ అరెస్టు