Breaking: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగంపేటలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు మృతి చెందారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు సరదాగా ఈత కొట్టేందుకు పిల్లలు, యువకులు కృష్ణానదిలోకి దిగారు. వారు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటం, కాలు ఆనకపోవడంతో నీటిలో మునిగిపోయారు. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మరణించారని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గత ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన అఫ్రీన్ (17), సమీర్ (8), నౌషిక్ (7), రిహాన్ (15) గా పోలీసులు గుర్తించారు. నదిని చూసేందుకు ఆటోలో మొత్తం 11 మంది వెళ్లినట్లుగా సమాచారం. వారిలో నలుగురు ఈతకు దిగి మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదశ్చాయలు అలుముకున్నాయి.
డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు .. రాజ్ భవన్ సీరియస్ ..డీఎంకే నేతపై పోలీసులకు ఫిర్యాదు