Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద రెండు బైక్ లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

ఆదిలాబాద్ జిల్లా తాంసి మంజడలం హుస్సాపూర్ సమీపంలో రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి మృతి చెందారు. మరో బైక్ పై ఉన్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆతన్ని అసుపత్రికి తరలించారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Omicron BF 7: మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రజలకు ప్రత్యేక సూచనలు