Road Accident: హైదరాబాద్ శివారు నార్సింగి సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిన్న రోడ్డు ప్రకన నిలిపిన టిప్పర్ ను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే ఈ రోజు మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. నార్సింగి సమీపంలోని మల్లూరు వద్ద ప్రయాణీకులతో వెలుతున్న ఆటోను వేగంగా వస్తున్న కారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆర్మూరు మండలం ఏలూరు వాసులుగా గుర్తించారు. వీరంతా ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తొంది.

ఈ ప్రమాదంలో మరి కొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా వాహన చోదకులు నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడుపుతుండటంతో నిత్యం జాతీయ రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి.