ఇటీవల కాలంలో ప్రేమించిన యువతీ యువకులు తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించరని స్నేహితుల సహాయంతో జంప్ అయి వివాహాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కొంత మంది తమ కుమార్తె కుటుంబ పరువు తీసిందని భావించి యువకుడిని కొట్టి బెదిరించడం, లేక హత్యలు చేయించడం కూడా జరుగుతోంది. పరువు హత్యలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. మేజర్ లు అయిన యువతులు వారు ప్రేమించిన వ్యక్తులతో ఇంట్లో నుండి వెళ్లిపోయి తమకు పెద్దల నుండి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది.

హూజూర్ నగర్ కు చెందిన ఓ యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇంట్లో చెబితే పెద్దలు ఆగ్రహిస్తారని భావించి ప్రేమ వివాహం చేసుకుని జంప్ అయ్యారు. విషయం తెలియడంతో యువతి కుటుంబీకుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. వెంటనే వీరు యువకుడి ఇంటి మీదకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. అయితే ఆ సమయంలో యువకుడి ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యువకుడి ఇంట్లో విలువైన వస్తువులు,, ఫర్నీచర్ అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?