తెలంగాణలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఇవేళ నుండి మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ బాటిల్ పై రూ.40ల వరకూ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన ధరలు నేటి నుండి అమలులోకి రానున్నాయి. హాఫ్ బాటిల్ పై రూ.20లు, క్వార్టర్ బాటిల్ పై రూ.10లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అధిక ధరల కారణంగా బయట రాష్ట్రాల నుండి మద్యం వస్తుందని భావించిన ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ధరల తగ్గింపు ప్రతిపాదన పంపింది.

అక్రమ మద్యం రవాణా, అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న నేపథ్యంలో మద్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అన్ని బ్రాండ్ల మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీర్ల ధరలు మాత్రం యథాతధంగా ఉంచాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందు బాబులు కుషీ అవుతున్నా.. ఎలక్షన్ ఇయర్ కావడం వల్లనే ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించారన్న విమర్శ పలు వర్గాల నుండి వినబడుతోంది.
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు ఎక్కువ కావడంతో ఏపికి తెలంగాణ నుండి అక్రమంగా మద్యం రవాణా జరుగుతోంది. వివిధ చెక్ పోస్టుల్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో పొరుగు రాష్ట్రాల నుండి ఏపికి వస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకుని రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. తెలంగాణలో మధ్యం ధరల కంటే పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంతం నుండి మద్యం అక్రమ రవాణా జరుగుతోంది.
YSRCP: మరల సొంత గూటికి చేరిన బొమ్మిరెడ్డి .. నెల్లూరులో టీడీపీకి షాక్