NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్

Breaking: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్టు చేసి ఆయనను చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఆయనపై పీడీ యాక్ట్ ను ఎత్తివేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

mla rajasingh

 

రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సతీమణి ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్ లలో వందకు పైగా కేసులు నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తూ సమాజంలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు,. ఆ మేరకు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేశారు ఏజి. రాజాసింగ్ తరపున న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను రవిచందర్ ప్రస్తావించారు. మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు తీర్పు వెల్లడించింది.

రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేస్తూ షరతులను విధించింది ధర్మాసనం. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా జైలు నుండి విడుదల అయ్యే సమయంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని కూడా షరతు విధించింది. అలానే మూడు నెలల పాటు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయవద్దని ఆదేశించింది. తక్షణం రాజాసింగ్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 40 రోజులుగా రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!